ఈరోజు టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం వారంతా లండన్‌కు బయలుదేరి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం అక్కడ అడుగు పెడతారు. నాలుగున్నర నెలల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉన్నందున.. అక్కడి ప్రభుత్వం క్రికెటర్ల కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇచ్చింది. ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టనున్న టీమిండియా.. మళ్లీ అక్కడి నుంచి బయటపడేది సెప్టెంబర్ 15వ తేదీ తరువాతే. ఈ నెల 18వ తేదీన సౌథాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడుతుంది. దీని తరువాత.. 42 రోజుల పాటు అక్కడే ఖాళీగా గడుపుతుంది. బీసీసీఐ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 22వ తేదీన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తరువాత.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ఆరంభం కావడానికీ మధ్య నెలన్నర వ్యవధి ఏర్పడింది. అంటే 42 రోజుల పాటు భారత జట్టు ఇంగ్లాండ్‌లో ఖాళీగా ఉంటుంది. ఇంగ్లాండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతుంది.
previous post