ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ విజయదశమి పండుగ సందర్భంగా గోరఖ్ నాథ్ దేవాలయంలో సంప్రదాయ పూజ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ నాథ్ దేవాలయంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి . గోరఖ్ నాథ్ దేవాలయంతో యోగికి విడతీయలేని బంధం వుంది. 11వ శతాబ్ధికి చెందిన ఈ ఆలయం కు ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. ఈ దేవాలయాన్ని సాధువులు నిర్వహిస్తారు .
దసరా పండుగ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఉదయమే పూజ చెయ్యడానికి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు , సాధువులు, నగర ప్రముఖులు సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు . దేవాలయంలో యోగి ఆదిత్యానాథ్ స్వయంగా సంప్రదాయ పద్దతిలో పూజ నిర్వహించారు .విజయదశమి పర్వ దినం సందర్భగా ఉత్తర ప్రదేశ్ ప్రజలకు , భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు .