సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ “అర్జున్‌రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన ఆటిట్యూడ్, బిహేవియర్‌తో ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటుంటాడు. విజయ్ నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తనపై జరిగే ట్రోలింగ్ గురించి విజయ్ మాట్లాడాడు. “ట్రోలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ట్రోల్స్ నాకు మంచి కిక్ ఇస్తుంటాయి. నెటిజన్లు తమ విలువైన సమయాన్ని నా సినిమాలు, స్టైల్‌ను విమర్శించేందుకు ఉపయోగిస్తున్నారు. నేను వారికి చాలా నిద్రలేని రాత్రులు ఇస్తున్నాను. వారి కలల్లోకి కూడా నేను వస్తున్నానేమో” అని విజయ్ వ్యాఖ్యానించాడు.
previous post