ఓ కుట్ర కేసులో శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలని కవులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిన్న హైద్రాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద ప్లకార్డులతో వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. వరవరరావును వెంటనే విడుదల చేయాలని, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడ్డ ఆయనకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఆయనపై పెట్టిన కేసుల్లో ఒక్కటి కూడా నిలబడలేదని అన్నారు. 81 ఏళ్ల వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం తగదన్నారు.

