కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు, హత్యలు జరగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం దళితులేనని ఆయన అన్నారు. దళితులు, గిరిజనుల ఓట్లతో గెలిచిన కేసీఆర్ ఇప్పుడు వాళ్లనే అణగదొక్కుతున్నారని మండిపడ్డారు.
గతంలో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో లాకప్ డెత్ జరిగిందని ఉత్తమ్ గుర్తు చేశారు. ఇప్పుడు మల్లారంలో రాజబాబు అనే దళితుడిని కొట్టి చంపారని ఆరోపించారు. దళితులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే తనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి నిర్బంధించారని తెలిపారు.