telugu navyamedia
వార్తలు సామాజిక

ప్రైవేటు స్కూళ్ల తల్లిదండ్రులకు విన్నపము: యాదగిరి శేఖర్ రావు

half day schools in AP since high temp

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు ప్రైవేటు విద్యాసంస్థల తల్లిదండ్రులకు సగౌరవ విన్నపాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
20-21 సంవత్సరం నెల నెలా ఫీజులు చెల్లించటం వలన యాజమాన్యం, ఉపాధ్యాయుల మరియు రేపటి పౌరుల బంగారు భవిష్యత్తు దేదీప్యమానం అవుతుందని ఈ కింది విషయాలను వెల్లడించారు.

1. విద్యా సంస్థ మనుగడకు ముఖ్యమైన వారు
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యం .

2. 2019 – 2020 సంవత్సరo ప్రతి పాఠశాల పాఠ్యాంశాల బోధన పూర్తిచేసి పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయడం జరిగింది .

3. మార్చి 14 నుండి కరోనా కారణంగా లాక్ డౌన్ చేయబడిన తరువాత , ప్రభుత్వ ఆదేశాల అనుసారం పిల్లలు పై తరగతులకు ప్రమోట్ చేయబడ్డారు.

4. 19-20 విద్యా పనులు అన్నీ పూర్తి అయినప్పటికీ
40 % పైగా తల్లిదండ్రులు ట్యూషన్ ఫీజులు చెల్లించలేదు.

5. ఈ బకాయిల వల్ల విద్యా సంస్థల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేక, ఇతర చెల్లింపులు చేయలేక యాజమాన్యం అప్పుల పాలయ్యారు.

6. జీతాలు లేక జీవనోపాధి కొరకు సుశిక్షితులైన , పిల్లల ప్రేమాభిమానాలు చూరగొన్న ఉపాధ్యాయులు ఇతర రంగాల వైపు మరలిపోయారు.

7. నైపుణ్యం కలిగిన వ్యక్తులు విద్యా రంగం నుంచి కనుమరుగైపోయారు. ఆ ప్రభావం స్పష్టంగా పిల్లల బంగారు భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉన్నది. జీతాలు చెల్లించినచో వారు తిరిగి పాఠశాలకు వచ్చే అవకాశం ఉన్నది.

8.లాక్ డౌన్ అనంతరం , ఫీజు బకాయిలు రాక , ఆర్ధిక తోడ్పాటు లేక తీవ్ర ఒత్తిళ్లకు లోనై మానసిక క్షోభతో 15 పైగా ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు స్వర్గస్తులైనారు. ప్రస్తుతం వారి పిల్లలు , కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నదా అని ఇతరులు భయపడుతున్నారు.

9. పాఠశాలల పున ప్రారంభం ఎప్పుడో తెలియదు కనుక ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యాబోధన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

10. విద్యార్థులు , తల్లిదండ్రులు ఆన్లైన్ తరగతులు కొరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆన్లైన్ విద్యాబోధనకు సిద్ధపడవలెను.

11. ఆన్లైన్ తరగతుల నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది. మీరు చెల్లించిన ఫీజులే వీటి కొనసాగింపునకు ఏకైక ఆధారం. 

12. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే ఆన్లైన్ తరగతులు నిర్వహించ గలము.

ప్రస్తుతం తల్లిదండ్రులు చేయవలసినవి ::

1. దయచేసి వెనువెంటనే 2019-20 బకాయిలు చెల్లించవలెను.

2. G.O.No: 46 ప్రకారం 2020- 21 సంవత్సరానికి ప్రతి నెలా ఫీజులు కూడా చెల్లించాలని మరొక్కమారు వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి యస్ మధుసూదన్, కోశాధికారి.
పి నాగేశ్వరరావు తెలిపారు.

ఫీజులు చెల్లించి మీ తోడ్పాటును అందించక పోయినట్లయితే దారిద్య రేఖకు దిగువన మరియు దిగువ మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందిస్తున్న 3000-3500 ప్రైవేటు విద్యాసంస్థలు కనుమరుగైపోయి కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ సంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నిరుద్యోగులై , ఆకలి కేకలతో కూడిన చావుకేకల మనము వినవలసి వస్తుందని పేర్కొన్నారు.

Related posts