మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన చెల్లెలు అనుష్పా వివాహం ఆమె ప్రియుడితో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిన్న అర్మాన్ ఇబ్రహీంతో జరిగింది.
అనుష్పాల, అర్మాన్‌ల వివాహా ఫంక్షన్ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రామ్ చరణ్, ఉపాసన జంట రాయల్ లుక్ లో అదిరిపోయేలా కన్పించారు. పెళ్లికి, రామ్ చరణ్ క్రీం కలర్ షేర్వాణిని ధరించగా, ఉపాసన భారీగా అలంకరించబడిన షరారా సెట్‌ను దరించింది. రామ్ చరణ్ ట్రెడిషనల్ ఎటైర్ లో స్టైలిష్ గా కనిపించాడు.
అలాగే దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది ఉపాసన.
తాజాగా తన సోదరి అనుష్పా పెళ్లి జరిగిందంటూ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. తన చెల్లెలు పెళ్లి ఫోటోలను పంచుకుంటూ ఉపాసన “నిజంగా నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. చాలా కృతజ్ఞతలు. నా ప్రియమైన సోదరి మీకు శుభాకాంక్షలు… నేను మీ ప్రేమలో మునిగిపోయాను” అంటూ దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది ఉపాసన.
అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శోభనా కామినేని, అనిల్ కామినేని దంపతుల కుమార్తె అనుష్పాల కామినేని. అర్మాన్ ఇబ్రహీం మాజీ ఇండియన్ ఎఫ్3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం కుమారుడు, చెన్నైకి చెందిన కార్ రేసర్…