రాహుల్ గాంధీ, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) వారిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఛాలెంజ్ చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు విరుద్దంగా వీరు చేస్తున్న ప్రసంగాల కారణంగానే జవదేకర్ ఇటువంటి నిర్ణయం తీసకున్నారు. కేంద్రం రైతులకు అనుగుణంగా వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందా.. లేదా అన్న దానిపై డిబేట్‌కు రమ్మని ఛాలెంజ్ చేశారు. ‘ప్రతిపక్ష నేత రాహుల గాంధీ ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు అతడిని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. వ్యవసాయ బిల్లులు మంచివా కాదా, రైతులకు మేలు చేస్తాయా అనే దానిపై రాహుల్ గాంధీ, డీఎంకేలకు ఇదే నా సవాల్ డిబేట్‌కు నేను సిద్దంగా ఉన్నాన’ని జవదేకర్ అన్నారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ రైతుల నిరసనను సత్యాగ్రహం అని ప్రజలు వారికి ఈ పోరాటంలో చేయూతనివ్వాలి కోరారు. ‘దేశంలో రైతులకు వ్యతిరేకంగా అమలు అయిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు సత్యాగ్రహం చేస్తున్నారు. దేశంలోని అన్నదాతలకు ప్రజలు కూడా మద్దతు ఇవ్వాల’ని రాహుల్ ట్వీట్ చేశారు. దాంతో కేంద్ర మంత్రి జవదేకర్ వ్యవసాయ బిల్లులు రైతుల సంక్షేమం చేస్తాయని, ఏమైన సందేహాలు ఉంటే రాహుల్, డీఎంకేలకు తాను డిబేట్‌కు సిద్దంగా ఉన్నానని జవదేకర్ అన్నారు.చూడాలి మరి ఈ విషయం పై ఏ విధంగా వారు స్పందిస్తారు అనేది.
next post


అధికార పార్టీ నేతల సేవల్లో పోలీసులు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి