ఈ నెల 17న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి నిర్మల్, రామగుండం వరకు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయని ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాల నుంచి ఇవి వెనక్కి వెళ్లిపోతాయని వివరించారు. వీటి నిష్క్రమణతో నిమిత్తం లేకుండా ఈశాన్య రుతుపవనాలు వస్తాయన్నారు.
తూర్పు భారతం నుంచి తేమగాలులు వీస్తున్నందున తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు 116 ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.


జైలులో జగన్ తో ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు: చంద్రబాబు