తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ సీటు నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై నిరసనగా అన్నదాతలు నామినేషన్లు వేశారు. ఎన్నికల గడువు సమీపించినా ఇంకా తమకు గుర్తులు కేటాయించకపోవడంపై బుధవారం రైతులు ఆందోళన చేపట్టారు.
తాజాగా నిజామాబాద్ ఎంపీ ఎన్నికపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదని, వాటిపై ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం లేనందున ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికను వాయిదా వేసి, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేలా సీఈసీ కి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో టీఆర్ఎస్ నుంచి కవిత, కాంగ్రెస్ నుంచి మధుయాష్కీ, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ ఉన్నారు.
రాజకీయాల కోసం రెచ్చగొట్టడం మానుకోవాలి: ఇంద్రకరణ్‌రెడ్డి