గోవాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో అక్కడ మృతిచెందారు. సన్‌బర్న్ ఈవెంట్ కోసం ఇద్దరు ఏపీ యువకులు గోవా వెళ్లారు. ఈవెంట్‌లో డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడంతో చనిపోయినట్టుగా గోవా పోలీసులు భావిస్తున్నారు. మృతులు సాయిప్రసాద్, వెంకట్‌గా గుర్తించారు. ఈ రోజు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

