telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రతి బడీని అమ్మ ఒడిలా మారుస్తూ, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సర్కారు కొత్త ప్రణాళికను ప్రారంభించింది

ఇక నుండి ప్రతి బడి-అమ్మ ఒడి మహిళలకు బడుల బాధ్యతలు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు.

రాష్ట్రంలోని ప్రతీ బడీ  ఒక అమ్మ ఒడిలా ఉండేలా ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

సీఎం ఆదేశాల ప్రకారం… ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.

కమిటీల్లో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్య క్షులు, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, ప్రతీ తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు సభ్యులుగా ఉంటారు.

ఇకపై పాఠశాలల్లో జరిగే ప్రతీ పనిని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానం తోనే చేపట్టనున్నారు. సంబంధిత కార్యాచరణను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

ప్రయివేటు బడు లపై మోజును తగ్గించట మేగాక నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించటంలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తోంది.

Related posts