telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలి: జగదీష్‌రెడ్డి

jagadish reddy

సీఎం కేసీఆర్‌ ఆశించిన పద్దతిలో పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనంను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రజాప్రతినిధుల మీద ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. పర్యావరణ సమస్య మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. ఇటువంటి భయానక సమస్యను అధిగమించేందుకు పల్లెప్రగతి తోడ్పడాలన్నారు.

భవిష్యత్‌ తరాలకు ఆక్సిజన్‌ అందించేలా పల్లె ప్రగతి ఉండాలని సూచించారు. ప్రజలను బెంబేలిస్తున్న సమస్య చెత్త డంపింగ్‌. ఈ సమస్యకు పరిష్కారమే ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డ్‌ల ఏర్పాటు అన్నారు. అదేవిధంగా ప్రతీ గ్రామం శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని శ్మశాన వాటిక రాష్ర్టానికే రోల్‌ మోడల్‌గా మారిందన్నారు.

Related posts