telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్ వ్యాఖ్యలు జోక్‌గా ఉన్నాయి: శివసేన

shivasena party

చైనా-భారత్‌కు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో శివసేన తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. ప్రధాని మోదీ తీరుపై విమర్శలు గుప్పించింది. కొవిడ్‌-19 వాపిస్తోన్న నేపథ్యంలో చైనా సైన్యం భారత సరిహద్దులో దాడి చేయడాన్ని ప్రారంభించాయని పేర్కొంది. చైనా సంక్షోభాలను అవకాశంగా తీసుకుని ప్రతిసారి దాడికి పాల్పడుతుందని శివసేన తెలిపింది.

గతంలో జిన్‌పింగ్‌ గుజరాత్‌ వచ్చినపుడు ఆయనను ప్రధాని మోదీ చాలా బాగా అతిథి మర్యాదలు చేశారని చెప్పింది. ఆయనకు మోదీ గుజరాతీ రుచులుతో విందు ఇచ్చారని పేర్కొంది. అయినప్పటికీ లాభం లేకుండా పోయిందని తెలిపారు. తమ భూభాగంలోకి చొరబడుతున్నారంటూ ఇరు దేశాలు పరస్పరం ఉద్రిక్తతలను పెంచుకుంటున్నాయని చెప్పారు. తాను మధ్యవర్తిత్వం చేసి, సమస్యను పరిష్కరిస్తానంటూ డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను శివసేన జోక్‌గా అభివర్ణించింది.

Related posts