telugu navyamedia
ఆరోగ్యం

పసుపు తైలంతో పలు ఉపయోగాలు..

మన దేశంలో పసుపు లేకుండా ఓ శుభకార్యం జరగదు. రోజు వంటల్లో కూడా మనం పసుపును విరివిగా ఉపయోగిస్తాం. పసుపులో యాంటీ-బయోటిక్ గుణాలు మాత్రమే వేడిని తగ్గించే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలూ ఉంటాయి. అందుకే పసుపు వల్ల రోగాలు త్వరగా నయం అవుతాయి. పసుపులో ఉండే ఆల్ఫా కర్క్యుమిన్ కారణంగా దాన్ని మందుల్లో ఎక్కువగా వాడుతారు. పసుపు లాగే… పసుపు తైలం కూడా యాంటీ-అలర్జిక్, యాంటీ-మైక్రోబయల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా యాంటీ-ఆక్సిడెంట్స్ అనేవి పసుపు నూనెలో ఎక్కువగా ఉంటాయి. పసుపు అద్భుతమైనదని ఆయుర్వేదంలో కూడా చెప్పారు.

శరీరంలో కీళ్ల నొప్పులు, ఇతరత్రా నొప్పుల నివారణకు పసుపు తైలం బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్నచోట ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎక్కువ శ్రమ పడినప్పుడు కండరాల నొప్పి వస్తుంది. దానికి కూడా ఈ తైలం ఉపయోగపడుతుంది. శరీరంలో ఎలాంటి వేడి ఉన్నా ఈ తైలం పోగొట్టగలదు. ఆర్థరైటిస్ సమస్యకు ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు తైలంతో మసాజ్ చేసుకుంటే… రక్త సరఫరా వేగం పుంజుకుంటుంది. అందువల్ల అనారోగ్యాలు నయం అవుతాయి. రక్త సరఫరా సరిగా లేని చోట ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ ఎటాక్స్ రాకుండా చేస్తుంది. పసుపు తైలాన్ని వాడుతూ ఉంటే.. డయాబెటిస్ రాకుండా ఉంటుంది. అలాగే గుండె, లివర్ సమస్యలూ రావు. కాన్సర్ ట్రీట్‌మెంట్‌లో కూడా ఈ తైలాన్ని వాడుతారు.

మడమల పగులు వంటి సమస్యలు ఉన్నవారు.. 2 టేబుల్ స్పూన్ల కొబ్బర నూనె, కొన్ని చుక్కలు పసుపు నూనె కలిపి.. తక్కువ మంటపై వేడి చెయ్యాలి. ఆ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు మడమలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే…మడమలు పగలడం జరగదు. చుండ్రు సమస్య ఉంటే.. పసుపు తైలం వాడటం శ్రేయస్కరం. మీరు ఇంట్లో తయారుచేసుకొనే కొబ్బరి నూనెలో 2 లేదా 3 చుక్కలు పసుపు తైలాన్ని కలపండి. దాన్ని రోజూ జుట్టుకు కుదుళ్ల వరకూ రాసుకోండి. క్రమంగా మీకు చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

పసుపు తైలానికి ఆవ నూనెను కలిపితే.. యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు మరింత పెరుగుతాయి. ఈ మిశ్రమాన్ని తరచూ వాడుతూ ఉంటే కాన్సర్ నయం కాగలదనీ, చర్మానికి కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె, 1 టేబుల్ స్పూన్ పసుపు నూనె కలిపి… చిన్న మంటపై వేడి చేసి… ఆ మిశ్రమాన్ని వాడుతూ ఉంటే… చాలా శారీరక సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

Related posts