telugu navyamedia
సినిమా వార్తలు

రేపే “మా ” బ్యాలెట్ సమరం

గత కొన్ని రోజులుగా అత్యంత ఉత్కంఠతను కలిగిస్తూ , వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ డైలీ సీరియల్ ను మరిపిస్తున్న “మా ” ఎన్నికలు 2021 ఆదివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరగబోతున్నాయి . ఇంతకు ముందు ఎప్పుడు “మా ” ఎన్నికలు ఫిలిం నగర్ లోని “మా ” కార్యాలయంలో జరిగేవి . మొదటిసారి ఫిలిం నగర్ కు సమీపంలోని జూబిలీ హిల్స్ స్కూల్ లో జరగబోతున్నాయి .

“మా ” ఎన్నికల కు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చాయి.తెలంగాణ రాష్ట్రము లో జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికను “మా ” ఎన్నిక మరిపించాయి . ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ప్యానల్స్ పోటీపడుతున్నాయి . ప్రకాష్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ఇస్తున్నారు . శుక్రవారం రాత్రి ప్రకాష్ రాజ్ కు ఎందుకు ఓటెయ్యాలి ? మంచు విష్ణుకు ఎందుకు ఓటెయ్యకూడదు అని చెబుతూ ఓ సంచలనం వీడియో విడుదల చేశారు.

మంచు విష్ణు కోసం ఆయన తండ్రి మోహన్ బాబు తన పరపతిని , శక్తి యుక్తులను ఉపయోగించారు . ఈసారి ఎన్నికల్లో కుల , మత , వర్గ, భాష , ప్రాంతీయ విభేదాలతో అనారోగ్య పరిణామాలకు తెర తీశారు . ఆరోపణలు , ప్రత్యారోపణలతో “మా”ను రెండు గ్రూపులు గా చీల్చారు . ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? ఎవరు పరాజయం పాలవుతారు . నటీనటులు ఎవరికీ మద్దతు ఇచ్చి గెలిపిస్తారు ? అనేది ఆదివారం సాయంత్రానికి తెలుస్తుంది .

Related posts