telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళి పీటలెక్కిన ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్

Prasanna

కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులు, విడుదల కూడా ఆగిపోయాయి. అయితే ఈ గ్యాప్ లోనే సినీ ప్రముఖులంతా పెళ్ళి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలు పెళ్లి చేసేసుకున్నారు. దగ్గుబాటి రానా… మిహికా బజాజ్ తో, నిహారిక కొణిదెల కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా యంగ్ టాలెంటెడ్ రైటర్ ప్రసన్న కుమార్, మౌనికల వివాహం నిన్న రాత్రి 8 :45 ని లకు రెవెన్యూ కల్యాణ మండపం(మచిలీపట్నం) నందు కొద్ది మంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దర్శకుడు త్రినాద్ రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్ తదితరులు హాజరయ్యారు. ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ త్వరలోనే రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీ బల్ ప్లేయర్ అరికపూడి రమణ రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు.

Prasanna Prasanna Prasanna

Related posts