telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కళ్ళెం వేసిందీ కాలమే!

పరుచుకున్న కుసుమ పరిమళమై
ఎగురుతున్న విహగ స్వర రవమై
అవనినీ అంబరాన్నీ
అల్లుకున్న అలల తీరం కాలం..
నవ్వే పువ్వుల ధీమాను
కబళించాలని చూసే
కంటకాలుగా…
పచ్చని పంటపొలాలను మింగే
వికృతరీతుల స్వభావాలకు
సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే…
పల్లెదనాన్ని మింగే పట్నపు వ్యామోహాల వలల దర్పణం …
కాలమే మరి..
పువ్వై,పుడమై,వనమై
మౌనంగా భాషించే కాలానికి
కళ్ళెం వేయాలని చూసే
హనన రీతులను దునుమాడే
సునామీ కూడా సమయ భావనల
ప్రతిధ్వనియే….
ఆశల గుర్రాలపై కోర్కెల రెక్కలతో
ప్రచండ వేగంతో సాగుతున్న మనిషికి
కరోనా రూపంలో కళ్ళెం వేసిందీ కాలమే!

Related posts