మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుల నేడు. పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులతో సెలెబ్రిటీలు, రామ్ చరణ్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు . ఈ సందర్భంగా పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు చెర్రీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఇక హీరో సాయి ధరమ్ తేజ్ వారి చిన్పప్పటి ఫొటోను షేర్ చేశాడు. ‘ఆ దేవుడు నీకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ మేజర్ త్రోబ్యాక్ పిక్ ను పంచుకుంటూ బర్త్ డే విషేస్ తెలిపాడు.
Charannnnn!!! 🤗🤗🤗😘😘😘 wish you a very happy birthday @AlwaysRamCharan ❤️
Celebrating your best year right after such a huge success and a wonderful performance
Wishing your many more cheerful years filled with Love, success and loads of laughter.#HBDRamCharan pic.twitter.com/mrvafybJCf
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 27, 2022
నిహారిక కూడా తన అన్నయ్య రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసింది. త్రో బ్యాక్ పిక్ఛర్ ను పంచుకుంటూ.. ‘నా బలం, నా స్వీట్ బ్రదర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో చాలా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసింది.
అలాగే రానా దగ్గుబాటి కూడా సోషల్ మీడియాలో రామ్ చరణ్, రానా కలిసి ఉన్న త్రో బ్యాక్ పిక్ఛర్ ను పంచుకుంటూ బర్త్ డే విషెస్ తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘నా సోదరుడు రామ్ చరణ్ ఇలాంటి పుట్టిన రోజులు చాలా జరుపుకోవాలి. ఈ కొత్త సంవత్సరం చరణ్ జీవితంలో మరింత సంతోషాన్నిమరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఈ రోజు నిన్నుచూడాలని కోరుకుంటున్నాను’ అంటూ పేర్కొన్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా కూడా చెర్రీ స్వీట్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా చెర్రీ బర్త్ డే స్పెషల్ సాంగ్ థమ్ నెయిల్స్ ను అభిమానులతో పంచుకున్నారు. అలాగే బుల్లితెర బ్యూటీ అనసూయ కూడా చరణ్ కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా త్రో బ్యాక్ పిక్చర్ ను పంచుకున్నాడు.
ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చేస్తున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘మా సీతా రామారాజు రామ్ చరణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ విష్ చేశారు. అలాగే ఆర్సీ 15 నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మెగా పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.
Happy birthday @AlwaysRamCharan! Wishing you happiness and contentment always! 🤗
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2022