telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీదేవి కూతురితో శ్రీకాంత్ కొడుకు “పెళ్ళిసందడి” ?

Khushi

గత పాతికేళ్ల క్రిందట ‘పెళ్లి సందడి’ సినిమాతో రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి అదే పేరుతో మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇటీవలే మోడ్రన్ ‘పెళ్లి సందడి’ సినిమాను ప్రకటించి ప్రేక్షకుల్లో ఆతృతను పెంచేశారు. అయితే ఈ సినిమా టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతల వివరాలు రివీల్ చేసిన ఆయన.. హీరోహీరోయిన్ల పేర్లు మాత్రం సీక్రెట్‌గా ఉంచడంతో సినీ వర్గాలన్నీ ఆ హీరోహీరోయిన్స్ ఎవరు? దర్శకేంద్రుడి స్కెచ్ ఏంటి? అనే దానిపైనే ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో రాఘవేంద్ర రావు నయా పెళ్లి సందడిలో శ్రీకాంత్ కొడుకు రోషన్‌ని హీరోగా తీసుకున్నారనే టాక్ బయటకొచ్చింది. ఇంతలో ఈ సీనియర్ డైరెక్టర్ హీరోయిన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దివంగత శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్‌ని ఈ మూవీలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేశారట రాఘవేంద్ర రావు. తన సినిమాతోనే ఆమెను వెండితెరకు పరిచయం చేయాలని దర్శకేంద్రుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఖుషీ కపూర్ తండ్రి బోణీ కపూర్ తన సొంత ప్రొడక్షన్ కంపెనీతోనే ఖుషీని పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Related posts