telugu navyamedia
క్రీడలు

భార‌త్‌కు మ‌రో ర‌జ‌త ప‌త‌కం..!

టోక్యో ఒలింపిక్స్‌లో 2020 లో భారత్‌కు ఈ రోజు చాలా ముఖ్యమైన‌ది. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. ఇక బంగారం పతకం పక్కా అనుకున్న రెజ్లర్‌లో పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్‌లో ఇండియన్‌ ప్లేయర్‌ రవి దహియా బంగారు పతకాన్ని చేజార్చుకున్నాడు. కానీ భారత ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్‌ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్‌ చరిత్రలోనే సిల్వర్‌ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు రవికుమార్. అయితే జర్మనీని 5-4తో ఓడించి 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో మొదటి పతకాన్ని సాధించింది.

ఇకదీపక్ పూనియా 86 కేజీల ప్లే-ఆఫ్‌లో శాన్ మారినోకు చెందిన అమిన్ చేతిలో ఓటమిని చవిచూశాడు. మహిళల 53 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన వెనెస్సా చేతిలో ఇండియన్‌ ప్లేయర్‌ వినేష్ ఫోగట్‌ ఓటమిని చవి చూసింది. ఇక 20 కిలోమీటర్ల నడకలో భారత్‌కు చెందిన సందీప్ కుమార్ 23 వ స్థానంలో నిలిచాడు.

కాగా ..ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో సుశీల్‌ కుమార్‌ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Related posts