telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

నేడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేసారు.

బాలయ్యకు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

తండ్రి స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా, సినిమా హీరోగా ఏది చేసినా సమాజసేవే పరమావధిగా అడుగులు వేస్తూ ప్రజల గుండెల్లో తనదైన ముద్ర వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్! మీ కోరికలన్నీ నెరవేరి, మీరు కలలుగన్న అన్నింటా విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.

నీపై ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వదాలు ఉండాలి అని పురంధేశ్వరి తన ట్వీట్లో పేర్కొన్నారు.

హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు. ఈ ఏడాది కూడా మీకు అంతా మంచే జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

గొప్ప విజయాలు, మంచి ఆరోగ్యం, ఆనందంతో ఈ ఏడాది మీకు మరో అద్భుతమైన సంవత్సరంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను అంటూ రవితేజ ట్వీట్ చేశారు.

Related posts