telugu navyamedia
ఆరోగ్యం

జుట్టు నల్లగా.. ఇలా.. దీనికి తిరుగేలేదు…

tips to overcome white hair ever

ఆహారం సరిగా తీసుకునే స్థితి నేడు ఏ వయసువారికీ లేకుండా పోయింది. దీనితో శరీరానికి కావాల్సిన పోషకాలలో కొరత ఏర్పడటం… దానివలన అనేక సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అందులో వయోభేదం లేకుండా చూస్తున్న సమస్య, నెరిసిన జుట్టు. ఇది రాకుండా ఉండడానికి, వచ్చిన వారు ఇకమీదటైనా సరైన చిట్కాలు పాటించి ఈ సమస్య నుండి విముక్తులు అవడానికి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. దీనికి వంశపారంపర్యం ఒక కారణమైతే, థైరాయిడ్, అధిక వత్తిడి, ఆందోళన మరొక కారణం. ముఖ్యంగా చిన్నపిల్లలలో పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరి.

@ రకరకాల షాంపూలను కాకుండా ఎప్పుడూ ఒకే రకమైన షాంపూలను మాత్రమే వాడాలి.

@ పాలు, గుడ్లు, సోయాబీన్స్, మెులకెత్తిన విత్తనాలు, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువుగా తీసుకొనటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

@ గుడ్డు తెల్లసొనలో కొద్దిగా కరివేపాకు లేదా మెంతి ఆకువేసి మెత్తగా ఫేస్టు చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

@ ఐదు టీస్పూన్ల ఉసిరిపొడి, 2 టీస్పూన్ల గోరింటాకు పొడి, 2 టీస్పూన్ల మిరియాల పొడి, 2 టీస్పూన్ల టీ పొడి, 2 టీ స్పూన్ల నువ్వులపొడి తీసుకొని దానికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీనిని రాత్రి పూట తయారుచేసి ఉదయానే 5 నిమిషాలపాటు సన్నటి సెగపై వేడి చేయాలి. తర్వాత దానిని తలకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

@ మందార ఆకుల్ని మెత్తగా పేస్టులా చేసి దానికి కొబ్బరినూనెను కలిపి తలకు రాయాలి. ఒక గంట తర్వాత శుభ్రంగా కడిగేసి తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

@ ఆముదంలో హెన్నపౌడర్ వేసి మరిగించి చల్లారిన తర్వాత తలకు పూసుకోవాలి. రెండుగంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే నల్లటిజుట్టు మీ సొంతం అవుతుంది.

@ ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కాఫీ పొడిని వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత జుట్టుకుదుళ్లకు బాగా మర్ధన చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

Related posts