ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ, అనీల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రలలో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం “మలంగ్”. మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇటీవల ఆదిత్య, దిశాల లిప్ లాక్కి సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన టీం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ని చూస్తుంటే సినిమా అంతా థ్రిల్లింగ్‌గా ఉంటుందని అర్ధమవుతుంది. కిల్లర్ గా ఆదిత్య, పోలీస్ ఆఫీసర్‌గా అనీల్ కపూర్ కనిపించనున్నారు. ఇక దిశా, ఆదిత్యలు ప్రేమికులుగా మోతాదుకి మించిన రొమాన్స్‌ని చూపించబోతున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.
							previous post
						
						
					
							next post
						
						
					


త్రిష, నయనతారలను తల్లి పాత్రల కోసం ఎందుకు అడగరు… హీరోయిన్ ఫైర్ ?