తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం లోకేష్ కంగరాజ్ దర్శకత్వంలో తన 64వ సినిమా చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ చిత్రం దళపతి 64 పేరుతో ప్రచారం జరుపుకుంటుంది. అయితే మూవీకి “జేడీ” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. చిత్రంలో విజయ్ పాత్ర జేమ్స్ దురైరాజ్ కావడంతో మూవీకి షార్ట్‌గా “జేడీ” అనే టైటిల్ పెట్టారని అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ సాయంత్రం రానుంది. విజయ్ సేతుపతి చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సోషల్ మెసేజ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేటి సాయంత్రం 5గం.లకి విడుదల కానుంది.
previous post


సినిమా ఇండస్ట్రీపై సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు