telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారుఖ్ సినిమా చేయకపోతే చచ్చిపోతానంటున్న అభిమాని

Sharukh

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్ త్రయంలో షారూక్ ఖాన్ లీడింగ్‌లో ఉండేవాడు. వరుసబెట్టి బ్లాక్‌బస్టర్లు దక్కించుకుంటూ తిరుగులేని హీరోగా నిలిచాడు. అయితే ఇటీవలి కాలంలో షారూక్ తన ప్రాభవం కోల్పోయాడు. వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. ఒకదాని తర్వాత మరొకటి, ఒకదానిని మించి మరొకటి.. వరుస ఫ్లాప్‌లే షారూక్‌కు ఎదురవుతున్నాయి. షారుఖ్ చివ‌రిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల షారుక్ కొత్త సినిమా పేరు “సంకి” అని, తమిళ దర్శకుడు ఆట్లీ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుందనే వార్తలు విన్పించాయి. 2017 నుంచి 2019 వరకు షారూఖ్ న‌టించిన సినిమాల‌న్ని డిజాస్ట‌ర్ అయ్యాయి. ‘రయీస్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, ‘జీరో’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండ‌డంతో షారూఖ్ కొద్ది రోజులకి సినిమాల‌కి బ్రేక్ ఇవ్వాల‌ని భావించారు. మంచి స్క్రిప్ట్ దొరిక‌న త‌ర్వాత‌, ఆ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌నే కాన్ఫిడెన్స్ వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే సినిమా చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టుకొని కూర్చున్నాడు షారూఖ్‌. కొద్ది రోజులుగా షారూఖ్ సినిమాల‌కి దూరంగా ఉంటున్న నేప‌థ్యంలో ‘న్యూ ఇయర్ రోజున తర్వాతి సినిమా గురించి ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను’ అని ఓ అభిమాని త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్టాడు. ఇది చూసి నెటిజ‌న్స్ షాక్ అయ్యారు. ఇలాంటి పిచ్చి ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని అత‌నికి హిత‌వు ప‌లికారు. షారూఖ్ త్వ‌ర‌లో రాజ్‌కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Related posts