telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

సహజ సౌందర్యానికి.. ఇలా ..

summer food is good for health and beauty

సహజత్వంలో ఉన్న గొప్పదనం ప్రస్తుత ప్రపంచానికి కూడా ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. వీలైనప్పుడల్లా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సహజ అందం కావాలని చాలా మంది ఆరాట పడటం ఎక్కువగా చూస్తున్నాం. కానీ సహజసిద్దమైన పద్దతులని పాటించడంలో మాత్రం మొఖం చాటేస్తారు. ఎందుకంటే అందుకు శ్రమతో కూడిన సహనం కావాలి కాబట్టి. ఈ పరుగుల ప్రపంచంలో అంత తీరిక ఎవరికీ ఉండటం లేదు కాబట్టి. కానీ పూర్వం ఇలాంటి ఫేస్ క్రీములు ఏమి లేవు కానీ ముఖం మందారం లా, పాల మీగడలా మెరిసిపోతూ ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. అందుకు గల కారణం సహజసిద్ద పద్దతులే. మీరు రోజు వారి వాడే క్రీములు పక్కన పట్టి ఈ పద్దతిని ఒక్క సారి ప్రయత్నించి చూడండి

* ముందుగా స్వచ్చమైన గేదె పాలు తీసుకోవాలి. ప్యాకెట్ పాలని ఏ మాత్రం ఇందులో వాడకూడదు. ఈ పాలని కాచి చల్లార్చి గోరు వెచ్చగా ఉన్న సమయంలో ముఖాన్ని శుబ్రంగా కడుక్కుని ఆ పాలల్లో దూదిని ముంచి ముఖంపై బాగా రుద్దాలి. ఆ తరువాత తేనే రోజ్ వాటర్ తీసుకుని ముఖానికి పట్టించి మర్దనా చేయాలి. ఆ తరువాత కొంత సమయం ఉండి, అలోవేరా జెల్ తీసుకుని బాగా మర్దనా చేయాలి. ఇలా మర్దనా చేస్తున్న సమయంలోనే ముఖంపై నునుపుదనం కనిపిస్తుంది. అంతేకాదు ఈ క్రీముని బాగా ఆరనిచ్చి అలాగే ఉంచేసుకోవచ్చు.

బయటకి వెళ్ళే సమయంలో మాత్రం వీటిని వాడకూడదు, ఎందుకంటే ఎండ వేడిమికి జిడ్డులా జారిపోతాయి. ఇంట్లో ఉన్న సమయంలో వీటిని రాసుకుని బాగా ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు నెల పాటు చేస్తే తప్పకుండా మీ ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.

Related posts