నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రత్యేక పూజలు చేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
“మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు