కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
రెండు వర్గాలుగా విడిపోయిన నేతలందర్నీ ఏకతాటిపైకి నడిపేందుకు కీలక సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. విబేధాలను వదిలి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగించి వారిని ఒకే మార్గంలో నడిచేలా ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ తీరు సరిగా లేదని.. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదంటూ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు రేవంత్ వర్గం కూడా కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతలతో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందని చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.
ఇలా రెండు వర్గాల అభిప్రాయాలు విన్న రాహుల్ గాంధీ… విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. మనస్పర్ధలు, విభేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చెప్పాలని… ఎక్కడపడితే అక్కడ ఇష్టారీతిలో మాట్లాడొద్దని స్పష్టం చేశారు.
పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే వారిపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఏమైనా ఉంటే తనతో, కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడాలని సూచించారు.
కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి