లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. వీరిని నేరుగాపై తరగతికి పంపుతారు. ఇప్పటికే తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన సమయం కూడా దాటడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది


ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్