telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్..

*నేడు బెంగ‌ళూరులో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..
*మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో భేటీ..
*సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు..

జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు.. మాజీ ప్రధానమంత్రి హెచ్​డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరుతారు. దేవెగౌడ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ కానున్నారు.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు.

Telangana CM KCR to visit Karnataka today, to hold talks with former PM Deve Gowda

దేశంలో ఉన్నప్రస్తుత సమస్యలు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులుల‌తో పాటు  భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్ వెంట గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందరెడ్డి బెంగళూరుకు వెళ్తారు. వారితో పాటు కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు.

కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవెగౌడ, కుమారస్వామిలతో సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ మళ్లీ సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

కాగా…ప్ర‌ధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సమయంలోనే… సీఎం కేసీఆర్ బెంగళూరుకు వెళ్తుండడం.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌కు భయమని.. అందుకే ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ.. తప్పించుకుంటున్నారని ప్ర‌తిప‌క్షాలు ఎద్దేవా చేస్తున్నారు.

Related posts