telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ కేబినెట్ కీలక భేటీ ఇవాళ – స్థానిక ఎన్నికలు, గో సంరక్షణ, గిగ్ వర్కర్స్ బిల్లు వంటి అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బిల్లు, గో సంరక్షణ విధివిధానాలపై మంత్రిమండలి చర్చించనుంది.

ప్రైవేట్‌ క్యాబ్‌ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

కులగణన, రేషన్‌కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు.

కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

గోశాల పాలసీపై కేబినెట్‌ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related posts