telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఇక నుంచి తెలంగాణలో 33 జిల్లాలు!

huge job notification in telanganaf
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం పాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం 31 జిల్లాలను ఏర్పాటు చేసింది.  మరో రెండు కొత్త జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. 
మహబూబ్‌నగర్‌ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క – సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్‌ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది.

Related posts