తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా టీడీపీ ఖాళీ కాబోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్‌లో ఎర్రబెల్లి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల తరువాత ఆంధ్రాలో కూడా టీడీపీ దుకాణం బంద్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, 16మంది ఎంపీల బలముంటే ప్రధాన మంత్రి కూడా కావచ్చని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సచ్చిన శవం లాంటిదని, దాని పక్కన కూర్చోని ఎంతఎడ్చినా ఉపయోగం లేదన్నారు. గత పాలకుల పరిపాలన కారణంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన రైతులు కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి తిరిగొస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు సమన్వయంతో కృషిచేసి వరంగల్ ఎంపీగా పసునూరి దయాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

