ఈ నెల 25వ తేదీన తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
25న ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేస్తారు.