telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాట: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

రాజధాని విషయంలో తమది ఎప్పుడూ ఒకే మాటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే . ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. అప్పట్లో అమరావతికి మద్దతు తెలిపి మాట తప్పం, మడమ తిప్పం అన్నవారు నేడు ఏమైపోయారని సీఎం జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు.

మాట్లాడిన ఆయన పరోక్షంగా జగన్‌పై ఆరోపణలు చేశారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతోనే ముందుకు వెళ్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతకుముందు సందిరెడ్డి శేఖర్ అనే దివ్యాంగుడికి పెన్షన్ తీసివేశారంటూ జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని డైలాగ్స్ కొట్టిన జగన్‌కు దివ్యాంగుల పెన్షన్లు ఎత్తివేయడం సిగ్గనిపించలేదా? అని ప్రశ్నించారు.

Related posts