ఏపీ రాజధాని అమరావతిలో అవినీతి జరిగితే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజధానిపై సీఎం జగన్ మౌనం వహించడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఆరేళ్లయినా రాజధానిపై చర్చ జరగడం బాధాకరమని అన్నారు.
రాష్ట్రానికి దశదిశ నిర్ణయించేది రాజధానే అన్నారు. అలాంటిదిరాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడటం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైజాగ్‌ను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు.