టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అక్రమాలు పేరుతో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రాజకీయనేతకు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని ఆయన అన్నారు. ఒక రేపిస్ట్, హంతకుడు రాజకీయాల్లో వుండ కూడదు అంటూ ఆయనను విమర్శించారు. వెలగపూడి రామకృష్ణ తండ్రి బ్రహ్మశ్వరరావు అవినీతి పరుడు కాబట్టే ఎలక్ట్రిసిటీ బోర్డు VRS ఇచ్చి సాగనంపిందని అన్నారు. వెలగపూడి వంగవీటి రంగ హత్య కేసులో నిందితుడు విజయవాడ నుంచి విశాఖ కు పారిపోయి వచ్చిన వ్యక్తి అని అన్నారు. ఇంటర్ పరీక్షలు కూడా ఆయన సోదరుడు దేవగుడి ఆదినారాయణ సహాయంతో కాపీకొట్టిన రాశాడని ఆరోపించారు. ఏజీ బిఎస్సి పాస్ కాలేదు.. ఒక విశ్వ విద్యాలయం నుంచి పట్టా కొనుగోలు చేశాడని అన్నారు. వెలగపూడి విద్యార్హత పై త్వరలో ఒక కేసు కూడా పడుతుందని అన్నారు. ఆయనకు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్ళు ఉన్నాయన్న ఆయన విశాఖ లో బినామీ పేర్లతో ఇళ్ళు ఉన్నాయని అన్నారు. వెలగపూడి బినామీలు.. బైరెడ్డి పోతన్న రెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్ర కుమార్, సతీష్ అంటూ పేర్లు కూడా ప్రకటించారు ఆయన వెలగపూడి బినామీలూ జాగ్రత్తగా ఉండాలి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. వెలగపూడి రాగమాలిక అనే సి.డి షాప్ అడ్డగా చేసుకుని రంగ హత్య ప్లాన్ చేశారని, అందుకే ఆయన్ని రాగమాలిక రామకృష్ణ అని మొదట పిలిచేవారని పేర్కొన్నారు. రంగాను కత్తి తో పొడిచిన హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని విజయసాయి ఆరోపించారు. విశాఖపట్నం కు బ్రతుకుతెరువు కోసం వచ్చి యాడ్ ఏజెన్సీ లో పనిచేశారని, విశాఖలో లిక్కర్ సిండికేట్ అక్రమాలు చేసి దేవినేని బాజీ, పేరుతో కబడ్డీ పోటీలు పెట్టి కలెక్షన్లు చేశారని అన్నారు. రజకులుకు చెందిన భూమి లాక్కొని అతని బినామీ పట్టాభి తో ఆక్రమణ చేయించారని అన్నారు.
previous post