దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు ఓ కోరిక ఉంది. బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా అగ్ర స్థానానికి చేరుకోవాలనేది తమన్నా కోరిక అందుకు అనుగుణంగానే ఎవర్‌గ్రీన్ బాలీవుడ్ హిట్ “హిమ్మత్ వాలా” రీమేక్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆ సినిమా దారుణ పరాజయాన్ని చవి చూసింది. దీంతో తమన్నాకు బాలీవుడ్ నుంచి అవకాశాలు రాలేదు. ఇక బాలీవుడ్‌ను మరిచిపోదామనుకునే దశలో “బాహుబలి-1” హిందీలో ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమాలో తమన్నా ఫరవాలేదన్పించినా… ఆమెకు బాలీవుడ్ నుంచి అవకాశాలు రాలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా హిందీలో ఓ సినిమా చేసింది తమన్నా. ప్రభుదేవాతో కలిసి ఆమె నటించిన “ఖామోషీ” ఇటీవల విడుదలైంది. ఈ సినిమా కూడా ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో తమన్నాకు మరోసారి బాలీవుడ్ లో పరాభవం ఎదురైంది. అంతేకాదు ఇటీవల తమన్నా నటించిన తమిళ చిత్రం “అభినేత్రి-2” కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
previous post
కమల్, రజనీ రాజకీయాలపై తమన్నా స్పందన