telugu navyamedia
క్రీడలు వార్తలు

నటరాజన్‌ సర్జరీ పూర్తి…

భారత పేసర్ నటరాజన్‌కు మోకాలి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని ఈ తమిళనాడు క్రికెటరే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అతి త్వరలో మైదానంలోకి అడుగుపెడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈరోజు నా మోకాలికి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. నా సర్జరీలో భాగమైన నిపుణులు, మెడికల్‌ టీమ్‌, సర్జన్స్‌, డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్‌కుకు కృజజ్ఞతలు. ఇక నా సర్జరీ విజయవంతం కావాలని విష్‌ చేసిన బీసీసీఐకి, అభిమానులు, నా శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు. వీలైనం త్వరగా ఫిట్‌నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి దిగుతా. మీ మద్దతు, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడిని’అని నట్టూ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన నట్టూ.. తొలుత బెంచ్‌కు పరిమితమయ్యాడు. కానీ సర్జరీ చేయాల్సిందేనని నిపుణులు తేల్చడంతో అతను అర్థాంతరంగా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సర్జరీ చేసుకున్న నట్టూకు తగిన విశ్రాంతి అవసరం. ఈ లెక్కన అతను ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఆడటం కష్టమే.

Related posts