telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

మహిళల కోసం .. సర్జికల్ స్ట్రైక్ .. చీరలు.. ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్.. తెలుసా..!!

surgical strike sarees as new trend

ట్రెండ్ అనే పదం ఫ్యాషన్ ప్రపంచాన్ని చాలా దూరం తీసుకొచ్చింది. ఏ విషయంపై సమాజంలో చర్చ జరుగుతుందో, దానిపై ఫ్యాషన్ వాలిపోతుంది. ఇటీవల మనం వింటున్న మాట సర్జికల్ స్ట్రైక్.. ఇప్పుడు ఈ ట్రెండ్ ని కూడా ఫ్యాషన్ ప్రపంచం ఫాలో చేస్తుంది. దీనితో అప్పుడే మహిళలకు అత్యంత ఇష్టమైన చీరల రూపంలో ఈ ట్రెండ్ తెరపైకి వచ్చేసింది. సాధారణంగా, మహిళలకు చీరలంటే ఎంత మోజు పడతారో చెప్పక్కర్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారస్ధులు ట్రెండుకు తగినట్లుగా చీరలను డిజైన్ చేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేలా డిజైన్ చేసి తమ వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటారు.

ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ‘సర్జికట్ స్ట్రైక్స్-2’ జరిపిన విషయం తెలిసిందే. సరిహద్దులోభారత సైనికుల పోరాటం సూరత్‌కు చెందిన వినోద్ కుమార్ అనే ఓ చీరల వ్యాపారిని కదిలించింది. బాలాకోట్ లో భారత్ జరిపిన మెరుపుదాడులతో సర్జికల్ స్ట్రైక్ చీరలు తయారు చేశారు. ఈ చీరలపై ప్రధాని మోడీతో పాటు… మిరేజ్ యుద్ధవిమానాలు, భారత సైనికుల్ని ముద్రించారు. ఇప్పుడీ చీరలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుల్వామా దాడికి రివేంజ్ చూపించిన సర్జికల్ స్ట్రైక్-2 ప్రపంచంలోనే హాట్ టాపిక్ అయ్యింది.

Related posts