telugu navyamedia
రాజకీయ వార్తలు

రాజకీయ పార్టీలకు ఆ విషయంలో ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం

supreme court two children petition

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి టికెట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ సోమవారం కొట్టివేసింది. బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ఈ పిటిషన్ వేశారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారిని ఆయా పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించరాదంటూ అదనపు షరతును చేర్చాలా భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి ఆదేశాలివ్వాలని కూడా పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టత ఇస్తూ రాజకీయ పార్టీలకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు.

ఇది రాజ్యంగబద్ధమైన కోర్టు అని, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువున్న వారిని పోటీకి నిలబెట్టరాదని రాజకీయ పార్టీలను తాము ఆదేశించలేమని జస్టిస్ గొగోయ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులన్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సంతానంపై ఎటువంటి షరతులు విధించలేదు.

Related posts