telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వ‌రంగ‌ల్ లో టీఆర్ఎస్ మేయ‌ర్ అభ్య‌ర్థి ఎవరంటే..?

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌తో పాటు.. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌.. ఇత‌ర స్థానాల‌ను కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని.. విజ‌య‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది తెరాస.. ఇక‌, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పాల‌క పార్టీ.. మేయ‌ర్ అభ్య‌ర్థిని కూడా ముందుగానే ఖ‌రారు చేసింది.. మాజీ ఎంపీ గుండు సుధారాణిని మేయ‌ర్ అభ్య‌ర్థిగా రంగంలోకి దింపింది.. టీఆర్ఎస్ అధిష్టానం కూడా గ్రీన్ ఇచ్చేసింది.. సీనియ‌ర్ పొలిటీష‌న్ అయిన ఆమె.. రాజ‌కీయ అనుభ‌వాన్ని, బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డంతో.. ఆమెను ఎంపిక చేసిన‌ట్టుగా చ‌ర్చ సాగుతోంది. వ‌రంగ‌ల్ జిల్లా నుంచి సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలిగా గుర్తింపు పొందిన ఆమె.. తెలుగుదేశం పార్టీ నుంచి 2005 నుండి 2010 వరకు వరంగల్ మున్సిప‌ల్ కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం వ‌హించారు.. ఇక‌, 2010 లో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత 2015లో టీడీపీ గుడ్‌బై చెప్పిన గుండు సుధారాణి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.

Related posts