telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పల్నాడు లో అల్లర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు ఉంటాయ : ఎస్పీ మల్లిక గార్గ్

పల్నాడు జిల్లా వినుకొండలో ఎస్పీ మల్లికాగార్గ్ అల్లర్లు సృష్టించేవారికి పబ్లిక్గా హెచ్చరించారు. ఫలితాలు వెలువడే రోజు జూన్ 4వ తేదీన అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

జిల్లాలో 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేస్తామని ఎస్పీ మల్లికాగార్గ్ హెచ్చరించారు.

పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధాకరమని, మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందన్నారు.

ఇప్పుడు తాను కూడా పల్నాడు జిల్లా వాసినే ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన లక్ష్యం అంటూ ఎస్పీ మల్లికాగార్గ్ స్పష్టం చేశారు.

పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు జరిగిన అల్లర్లలో మొత్తం 160 కేసులు నమోదు కాగా.. 1200 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కౌంటింగ్ పూర్తయ్యే ఎవరు రోడ్లపై తిరగొద్దని హెచ్చరించారు.

Related posts