తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్ల లో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనుంది.
అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ www.tgbcstudycircle.cag.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్ సూచించింది.
తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షాయాభై వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించకూడదని పేర్కొంది.
ఎంపిక విధానం ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ నియమం ప్రకారం ఉంటుందని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఉంటుందని స్టడీ సర్కిల్ డెరైక్టర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారు: భట్టి విక్రమార్క