గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన “జెర్సీ” ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రీమియర్స్ తోనే మంచి టాక్ అందుకుని హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. గౌతమ్ దర్శకత్వ ప్రతిభకు, నాని సహజ నటనకు, హీరోయిన్ గా చేసిన శ్రద్ధా నటనకు ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే శ్రీరెడ్డి మాత్రం మరోసారి నానిని టార్గెట్ చేసింది. “ఈ నూనిగాడి యాక్టింగ్ చూసి నిజ జీవితంలో కూడా మంచోడు అనుకుంటున్నారు… కర్మరా బాబు” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నాని అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. శ్రీరెడ్డి మాత్రం ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారీ నానిపై తన విమర్శలు కొనసాగిస్తోంది.
							previous post
						
						
					
							next post
						
						
					


ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీమోహన్