telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

‘టిక్‌టాక్‌’ పై నిషేదం ఎత్తివేత.. షరతులు వర్తిస్తాయి!

Kcr vedeo post youth arrest telangana

టిక్‌ టాక్ వీడియో యాప్‌ కొద్ది కాలంలోనే ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా షార్ట్ వీడియోలను స్పెషల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్, షేర్‌ చేసుకోవచ్చు. చైనాకు చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌ పై నిషేధాన్ని ఎత్తివేశారు. మద్రాసు హైకోర్టు ధర్మాసనం కొన్ని పరిమితులతో మధ్యంతర నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్‌లో 54 మిలియన్ల యూజర్లు ఉన్నట్టు ఈ యాప్ వెల్లడించింది. ముత్తుకుమార్ అనే న్యాయవాది వేసిన కేసు ఆధారంగా హైకోర్టు దీనిపై మధ్యంతర నిషేధాన్ని విధించింది.

అయితే పోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదంటూ కొన్ని పరిమితులు విధిస్తూ బుధవారం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ విషయంలో వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీకి చెందిన వీడియోల కారణంగా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలంటూ ఏప్రిల్ మూడున హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అప్పటికీ దానిపై విచారణ జరుగుతుండటంతో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం అంగీకరించలేదు. ఏప్రిల్ 18 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ స్టోర్‌, గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌ను బ్లాక్‌ చేశారు. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చైనా కంపెనీ బైట్ డ్యాన్స్‌ సుప్రీంను ఆశ్రయించింది. తమ తరఫు వాదనలు వినకుండా కోర్టు మధ్యంతర నిషేధాన్ని విధించిందని, ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని దానిలో పేర్కొంది.

Related posts