ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.. శ్రీరెడ్డి గురించి, ఆమె క్యారెక్టర్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకు కౌంటర్‌గా శ్రీరెడ్డి స్పందించింది. ‘‘వెర్రి *** మాస్టర్ నీ మీద జాలి వేస్తోంది రా అడవి పంది. నా బూతుల పంచాంగం విప్పితే నీ పూర్వీకులు దిగొచ్చి సారీ చెప్తార్రా పబ్లిసిటీ క్రేజ్ కుక్క” అంటూ దారుణంగా విరుచుకుపడింది. టాలీవుడ్ లో నానా రచ్చ చేసిన తరువాత తమిళనాడులోనైనా సినిమా అవకాశాలు రాకపోతాయా అని ఆశగా అక్కడికి వెళ్లింది. అక్కడే ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. ఓ ఆరు నెలల పాటు తమిళనాడులో ఉన్న శ్రీరెడ్డి మొన్ననే హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. శ్రీరెడ్డి కొన్ని నెలల క్రితం యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసింది. మొదట్లో ఇతరులపై బురద జల్లేందుకు, తనపై వస్తున్న కామెంట్స్‌కు కౌంటర్లు వేసేందుకు యూట్యూబ్ వీడియోలు చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు మారిపోయింది. ఆమె చివరిగా పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియో ‘మా’ రచ్చకు సంబంధించినది. ఆ తర్వాత ఎలాంటి కాంట్రొవర్షియల్ వీడియోలు పెట్టలేదు. దానికి బదులు తనకు వచ్చిన వెరైటీ వంటల వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఎందుకంటే వీటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. శ్రీరెడ్డి ఇతరులను తిడుతూ పెట్టే వీడియోలకు వేలల్లో మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. కానీ వంట వీడియోలకు మాత్రం లక్షల్లో వస్తున్నాయి. ఒకప్పుడు అసభ్యకరమైన దుస్తులు వేసుకుని ఎక్స్‌పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేది శ్రీరెడ్డి. కానీ ఇప్పుడు అలాంటివి కూడా తగ్గించేసింది. పద్ధతిగా నిండుగా ఉన్న దుస్తులు, చీరలు కట్టుకుంటోంది. ఆమెలో వచ్చిన మార్పుకి నెటిజన్లు కూడా షాకవుతున్నారు.
previous post
next post
పదిహేనేళ్ల క్రితం నుంచే ఆలియా అంటే ఇష్టం : రణబీర్ కపూర్