telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి…

srireddy

విజయ్ దేవరకొండ ‘షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు’ అంటూ రెండు చేతులు జోడించి.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాడు. మొత్తానికి ఈ క్రేజీ హీరో కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తన వంతుగా ప్రయత్నం చేయడంతో అందరూ అభినందిస్తున్న తరుణంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి విజయ్ దేవరకొండని టార్గెట్ చేసింది. కాపీ క్యాట్ అంటూ ఓ పోస్ట్ వదిలింది. విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను కాపీ కొడుతున్నాడంటూ ఫీల్ అవుతుంది శ్రీరెడ్డి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలింది. ‘విజయ్ దేవరకొండ మిమ్మల్ని నేను చాలా ఇష్టపడతా దయచేసి మీరు మీలా ఉండండి. ఆ రణ్‌వీర్ సింగ్‌ని కాపీ కొట్టకండి. జిరాక్స్ కాపీ వద్దు.. విజయ్‌లా ఉంటే చాలు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని లుక్స్ ఇంచు మంచు రణ్‌వీర్‌ని కాపీ కొట్టినట్టుగానే ఉన్నాయి. 

Related posts