telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోల్ రైడా కొత్త వీడియో సాంగ్ “డోంట్ రైడ్ ర్యూడ్”

Roll-Rida

బిగ్ బాస్ సీజ‌న్ 2 ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు ర్యాప్ సింగర్ రోల్ రైడా. ర్యాప్ సాంగ్స్ తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తరువాత ప‌లు సోషల్ మెసేజ్ లు ఉన్న ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఉమెన్స్ డే సందర్భంగా రోల్ రైడా చేసిన ఆల్బమ్ ఆకట్టుకుంది. ఇక తాజాగా “డోంట్ రైడ్ ర్యూడ్” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశాడు. ఈ వీడియోలో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం, సిగ్న‌ల్ జంప్ చేయ‌డం వంటివి చేస్తే ఎదుర‌య్యే అన‌ర్ధాల‌ని తెలియ‌జేశాడు. ప్ర‌తి నాలుగు నిమిషాల‌కి ఒక‌రు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతున్నారు. ధ‌నిక, పేద‌, ప‌ట్ట‌ణం, ప‌ల్లె, మ‌గ‌, ఆడ అనే తేడా లేకుండా రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. మ‌నంద‌రం క‌లిసి ప్ర‌జ‌ల‌లో సామాజిక చైత‌న్యం తీసుకురావాలి అని రోల్ పేర్కొన్నాడు. ఈ సాంగ్ ను మ‌ధుర ఆడియో ద్వారా విడుదల చేశారు. 

Related posts